MNCL: హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు జాత గురువారం వేమనపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో జనవరి 18 CPI బహిరంగ సభ జరగనున్నదని వెల్లడించారు. ఈ సభకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.