»Mumbai High Court Harassing Husband With False Cases Is Cruelty
Mumbai High Court: తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
కొందరు భార్యలు లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా కేసు నమోదు చేస్తున్నట్లయితే క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం తెలిపింది.
Mumbai High Court: Harassing husband with false cases is cruelty
Mumbai High Court: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు భార్యలు లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా కేసు నమోదు చేస్తున్నట్లయితే క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానం జారీ చేసిన విడాకులను రద్దు చేసి, దాంపత్య హక్కులను పునరుద్ధరించాలన్న ఓ మహిళ వినతిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ వై.జి.ఖొబ్రగడే తీర్పు వెలువరించారు.
2004లో వివాహమైన జంట 2012 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లిన భార్య వేధింపుల ఆరోపణలతో భర్త, అతని తండ్రి, సోదరుడిపై పోలీసు కేసులు పెట్టారు. అయితే న్యాయస్ధానాలు వారిని నిర్దోషులుగా ప్రకటించాయి. తప్పుడు కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసిన భార్యతో వైవాహిక బంధాన్ని ముగించుకోవడానికి అనుమతించాలంటూ భర్త కుటుంబ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. 2023లో విడాకులు మంజూరయ్యాయి. దీనిని సవాల్ చేస్తూ మాజీ భార్య హైకోర్టును ఆశ్రయించారు.