»Radhika Khera After Leaving The Party Khera Made Serious Allegations Against Congress Leaders
Radhika Khera: పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసిన ఖేరా
కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రాధికా ఖేరా ఆ పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. చత్తీస్గఢ్లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని ఆమె ఆరోపించారు.
Radhika Khera: After leaving the party, Khera made serious allegations against Congress leaders
Radhika Khera: కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రాధికా ఖేరా ఆ పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. చత్తీస్గఢ్లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని ఆమె ఆరోపించారు. రాధిక ఇంట్లో రాముడి జెండాను పెట్టిన రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ ఆమెపై దాడి చేస్తుందన్నారు. పార్టీ నాయకులు కూడా ఎప్పుడు ఆమెను అవమానించేవారట. అయితే రాహుల్ గాంధీ న్యాయయాత్ర సాగుతున్న సమయంలో మీడియా ఛైర్మన్ సుశీల్ గుప్తా తాగిన స్థితిలో రాధిక ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు.
తనకి మద్యం ఇవ్వాలని చూశారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో సుశీల్ ఆనంద్ శుక్లాతో మాట్లాడటానికి వెళ్తే.. వాళ్లు మరో ఇద్దరు నాయకులతో కలిసి గదిలో బంధించి దాడి చేశారని ఆరోపణలు చేశారు. ఎంత అరిచినా ఎవరు తలుపు తీయలేదు. పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించినందుకు ఆమెపై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారని ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.