»Virat Kohli Virat Kohlis Place In The List Of Change Makers
Virat Kohli: ఛేంజర్ మేకర్స్ జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు
ప్రముఖ మ్యాగజైన్ డిసెంబర్ నెలకు ఔట్లుక్ బిజినెస్ రూపొందించిన 'ఛేంజర్ మేకర్స్-2023' జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ డిసెంబర్ నెలకు ఔట్లుక్ బిజినెస్ రూపొందించిన ‘ఛేంజర్ మేకర్స్-2023’ జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. దేశంలో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఈ మ్యాగజైన్ రూపొందించారు. అయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం. విరాట్ కోహ్లీతో పాటు ప్రముఖ రాజకీయవేత్త రాహుల్ గాంధీ, సినిమా రంగం నుంచి షారుఖ్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళీ, క్రీడారంగం నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తదితరులకు కూడా ఈ మ్యాగజైన్లో చోటు దక్కింది.
Virat Kohli is the only cricketer in "Changer Makers – who shaped 2023" by Outlook Business.
వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యాక ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా కోహ్లీ పాల్గొనలేదు. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా విరాట్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ సిరీస్ చివరన జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.