తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ‘గరుడ’ సినిమా. మహేష్ బాబు, రాజమౌళి కలిసి తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఈ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయలు పలుకుతుందని, చిత్రీకరణ కోసం మూడు సంవత్సరాలు పట్టేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహేష్ బాబు అభిమానులు ఈ వార్తతో చాలా ఉల్లాసంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వారు ఈ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. వాస్తవానికి ఈ వార్త 2015 నుంచి ప్రచారం లో ఉంది., కానీ రాజమౌళి – మహేష్ ఈ కథను ఎంచుకుంటారు లేదా అనే చర్చ జరుగుతుంది.
రాజమౌళి గతంలో ‘బాహుబలి’ మరియు ‘RRR’ వంటి హిట్ సినిమాలను రూపొందించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ‘RRR’ ఆస్కార్ అవార్డ్ పొందడం ద్వారా రాజమౌళి అంతర్జాతీయ ప్రేక్షకులందరికీ చేరువయ్యారు.
ఇక తాజా న్యూస్ ప్రకారం, ‘గరుడ’ సినిమా కు జేమ్స్ క్యామెరాన్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వొచ్చని తెలుస్తోంది. ఇది నిజమైతే, ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా మరింత క్రేజ్ పొందడం కష్టం కాదు.. జేమ్స్ క్యామెరాన్ వంటి లెజెండరీ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ పై తన ముద్ర వేసినా, ‘గరుడ’ సినిమా అనూహ్యమైన ప్రాజెక్ట్ గా మారవచ్చు.
సినిమా పరిశ్రమలో ఒక కొత్త మైలురాయిని చేరుకునే ఈ ప్రాజెక్ట్ కి ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా టాలీవుడ్ లో మాత్రమే కాదు, పాన్ వరల్డ్ ప్రేక్షకులకు కూడా ఒక గొప్ప అనుభవాన్ని అందించాలని కోరుకుందాం. మన తెలుగు సినిమా ప్రపంచ సినీ పటం లో ఉండడం కంటే ఇంకా గొప్ప మైలురాయి ఏముంటుంది.