SS Rajamouli and other Indians invited to join The Academy : తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli). దర్శక విభాగంలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి( rama rajamouli) ఆస్కార్ అకాడమీ(oscar Academy) నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన తెలుగువారిగా గౌరవం దక్కించుకున్నారు.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. వీరితో పాటుగా మరి కొంత మంది భారతీయులు సైతం ఈ గౌరవాన్ని పొందారు. రితేష్, సిద్వానీ, షబానా అజ్మీ(Shabana Azmi), రవివర్మన్ తదితరులకు సైతం ఈ ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది అకాడమీ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు మొత్తం 57 మందికి ఈ ఆహ్వానాలు పంపించింది. ఈ ఆహ్వానాలు పంపుతున్నందుకు తమకు ఆనందంగా ఉందని అకాడమీ పేర్కొంది.
పోయిన ఏడాది సైతం భారత్ నుంచి కొందరు ప్రముఖులకు ఈ అకాడమీలో సభ్యత్వం లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో పని చేసిన రామ్‌చరణ్, కీరవాణి, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్‌లు ఈ అకాడమీలో సభ్యత్వం పొందారు. ఇక ఈ ఏడాది రాజమౌళి దంపతులకు ఈ గౌరవం లభించింది. రాజమౌళి ఇప్పుడు మహేష్‌బాబుతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.