మగధీర సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 15 ఏళ్ళు. రాజమౌళి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుంటుంది. రామ్ చరణ్ చిరుతతో పరిచయమయ్యి… రెండవ సినిమా రాజమౌళితో పడటం అది కూడా భారీ సినిమా అవడం చరణ్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. చరణ్ కు గాని, రాజమౌళికి గాని ఈ సక్సెస్ ఓవర్ నైట్ రాలేదు. మగధీర వెనుక చాలా పెద్ద కథ ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో అప్పటివరకు మగధీర లాంటి భారీ బడ్జెట్ సినిమా రాలేదు. 2009 ప్రాంతంలో సుమారు 40-50 కోట్లతో సినిమా నిర్మాణం అంటే ఒక సంచలనమే. అప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ అయినా కూడా అంత మార్కెట్ లేదు. ఈ సినిమా నుంచి రాజమౌళి నేర్చుకున్న పాఠాలెన్నో… ఒక ఇంటర్వూ లో మాట్లాడుతూ ‘మగధీర చేస్తున్న టైం కి నా కెరీర్ లోనే కాదు.. ఇండస్ట్రీలోనే అది ఖరీదైన సినిమా… అప్పుడు భారీ బడ్జెట్ ను ఎలా హేండిల్ చెయ్యాలి, సెట్స్ భారీగా వేస్తే ఎంత ఖర్చు అవుతుంది… ప్రొడక్షన్ ను ఎలా హేండిల్ చేయాలి లాంటి ఎన్నో అంశాలు నేర్చుకున్నా… కథకు అవసరమైనది మాత్రమే మనం చేయాలి. నా దగ్గర ఉన్న కథకు ఏ హీరో సరిపోతాడా అతన్నే ఎంచుకుంటాను… సరిపోకపోతే వెయ్యి కోట్లు ఆఫర్ చేసినా ఆ హీరోను పెట్టుకోను’.. అని రాజమౌళి అన్నాడు
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. RRR తో ఆస్కార్ లెవెల్ కి వెళ్లిన జక్కన్న త్వరలోనే మన తెలుగు పవర్ ప్రపంచం మొత్తానికి చూపించబోతున్నాడు