MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగంజి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా గురువారం రాత్రి లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో లక్షదీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి కార్తీక అమావాస్య రోజున ఇటువంటి నిర్వహిస్తామని ఆలయ కమిటీ, అర్చకులు వెల్లడించారు.