NRPT: తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా వారికి అండగా నిలబడతామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నుండి హైదరాబాద్ వెళ్లి ద్విచక్ర వాహనాలపై పండ్ల వ్యాపారం చేస్తున్న వారిని ఆయన గురువారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొత్తం ప్రజలు ఇబ్బంది పడితే వారి జీవనోపాధి దెబ్బతింటుందన్నారు.