MDK: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. హైదరాబాదు నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులతో మాట్లాడారు. మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.