Kerala : కేరళలోని మలప్పురంలో పొరుగు ఇంటి రిమోట్ కంట్రోల్ గేటులో ఇరుక్కుని తొమ్మిదేళ్ల బాలుడు చనిపోయాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృత దేహాన్ని చూసిన అమ్మమ్మ గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె మరణించింది. అమ్మమ్మ, మనవడు ఒకే రోజు మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఇద్దరు అంతిమయాత్ర ఒకేసారి చేసేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో అక్కడ విషాధ వాతావరణం ఏర్పడింది.
ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో కొట్టక్కల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఉంచారు. మహ్మద్ సినాన్ అలించువాడ్లోని ఎంఈటీ సెంట్రల్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు.
మలప్పురంలోని తిరుర్ వలత్తూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అబ్దుల్ గఫూర్ తొమ్మిదేళ్ల కుమారుడు ముహమ్మద్ సినాన్ తన పొరుగువారి ఇంటి గేటు గుండా వెళుతున్నాడు. గేట్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. సినాన్ గేటు బయటికి రాగానే అందులో ఇరుక్కుపోయాడు. గేటులో చిక్కుకున్న చిన్నారిని చూసి చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. సినాన్ను గేటు నుండి బయటకు తీసేందుకు కుదరలేదు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
దీంతో కుటుంబ సభ్యులు సినాన్ను చికిత్స నిమిత్తం కొట్టక్కల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు చనిపోయినట్లు ప్రకటించారు. సినాన్ మృతితో కుటుంబ సభ్యులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరుమున్నీరుగా విలపించారు. మనవడి మరణ వార్త విన్న బామ్మ ఆసియా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చి ఆమె కూడా మరణించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆసియాకు గుండెపోటు వచ్చింది. అమ్మమ్మ, మనవడు మృతి చెందడంతో ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అమాయక సినాన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.