»Chandigarh Mohali Bank Security Guard Shot Customer Come With Mother Died
Chandigarh : డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చి తల్లికొడుకు.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు
చండీగఢ్‌లోని మొహాలీలో బ్యాంకులో కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. బ్యాంకులో లావాదేవీ చేసేందుకు పలికి వచ్చిన ఓ వ్యక్తిని బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్చిచంపాడు.
Chandigarh : చండీగఢ్‌లోని మొహాలీలో బ్యాంకులో కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. బ్యాంకులో లావాదేవీ చేసేందుకు పలికి వచ్చిన ఓ వ్యక్తిని బ్యాంకు సెక్యూరిటీ గార్డు కాల్చిచంపాడు. బుల్లెట్ కారణంగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు, అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఆ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. మొత్తం వ్యవహారం మొహాలిలోని ముల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లోని మజ్రా గ్రామానికి చెందినదని పోలీసులు తెలిపారు. ఇక్కడి యూనియన్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డు గురీందర్ సింగ్ కస్టమర్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. మణి అనే యువకుడు మజ్రా గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. మణి తన తల్లితో కలిసి లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంకు లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు గురీందర్తో వాగ్వాదం జరిగింది.
గేటు తెరవకపోవడంతో గొడవ
సెక్యూరిటీ గార్డు గురీందర్ గేటు తెరవకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో బ్యాంకులో ఉన్న మరికొందరు వచ్చి సర్ధిచెప్పారు. గేటు తెరవడంపై చర్చ ప్రారంభమైన సమయంలో సెక్యూరిటీ గార్డు బ్యాంకులోపలే ఉండిపోయాడు. కాగా మణి అతనితో గొడవపడి బయటకు వెళ్లాడు. గురీందర్ అకస్మాత్తుగా బ్యాంకు బయటి గేటు తెరిచి గేటు వద్ద నిలబడి మణిని కాల్చాడు. ఈ కాల్పుల్లో మణి రోడ్డు పైనే గాయాలతో పడిపోయాడు.
సెక్యూరిటీ గార్డు అరెస్టు
అతనితో పాటు మరికొందరు కూడా నిలబడి ఉన్నారు. అందరూ వెంటనే మణిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మణి మృతి చెందాడు. గురీందర్ కాల్పులు జరపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గురీందర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.