Bus Accident: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులొ బస్సు బోల్తా పడింది. హిమాచల్‌ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు సిమ్లా (Shimla)లోని రోహ్రు ప్రాంతంలో ప్రయాణిస్తుంది. ఆ రోడ్డు మార్గం అంతా ఘాట్స్ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గురైన బస్సు కుద్దు నుంచి దిల్తారీకి బయలుదేరింది. ఈ నేపథ్యంలో జుబ్బల్‌లోని కెంచి ప్రాంతంలోకి రాగానే బస్సు అదుపుతప్పింది. దాంతో వాహనం ఆమాంతం లోయలోకి దూసుకెళ్లింది. అప్పటికి డ్రైవర్ ఎంత ప్రయత్నించిన బ్రేకులు పడలేదు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్, ఓ మహిళ, నేపాలీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. బస్సులో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.