Tajinder Bittu: A senior Congress leader who left the party during the elections
Tajinder Bittu: ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి, తజిందర్ సింగ్ బిట్టు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. గత కొన్ని రోజులు తజిందర్ సింగ్ బీజేపీ అగ్రనేతలతో సమావేశాలు జరిపారు. దీంతో తజిందర్ సింగ్ బీజేపీలో చేరే అవకాశం ఉందని అప్పటినుంచే ఊహాగానాలు వినిపించాయి. అనుకున్నట్టుగానే తజిందర్ సింగ్ ఢిల్లీలోని బిజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాని.. ప్రజా సంక్షేమ అంశాలపై పార్టీ ఎప్పుడు మాట్లాడటం లేదని, పార్టీ తీరు మారుపోతున్నదని ఆరోపించారు . పంజాబ్ ప్రజల మేలు కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరానని తజిందర్ తెలిపారు.