»Seven People Died And More Than 20 People Were Injured In A Bus Accident
Road accident : గుడికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
తీర్థయాత్రకని బయలు దేరిన మినీ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Five people from Amalapuram died in an American road accident
Road accident in Ambala : తీర్థయాత్రకని ఒకే కుటుంబానికి చెందిన 30 మంది మినీ బస్సులో బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆ బస్సు ఓ ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలాలో జరిగింది. అంబాలా, దిల్లీ, జమ్ము జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దగ్గరలోని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు వీరు మాతా వైష్ణో దేవి పుణ్య క్షేత్రాన్ని దర్శించడానికి వెళుతున్నారు. ఈ క్రమంలో 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు(bus) ఇలా మార్గ మధ్యంలో ప్రమాదానికి గురైంది. మృతి చెందిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతోనే వేగంగా వస్తున్న మినీ బస్సు దాన్ని గుద్దుకుందని తెలిపారు. ఈ యాక్సిడెంట్లో మినీ బస్సు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయ్యిందని అన్నారు.