Bujji Car : ప్రభాస్ ‘బుజ్జి’ కార్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ‘బుజ్జి’ అనే కారుకు సంబంధించిన వివరాలను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. దానికి ఉన్న ప్రత్యేకలేంటి? దాన్ని తయారు చేసేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? తెలుసుకుందాం రండి.
Kalki 2898 AD Bujji Car Features : వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రభాస్(PRABHAS). ఆయన నటిస్తున్న తాజా చిత్రం నాగ్ అశ్విన్(NAG ASHWIN) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఈ చిత్రానికి సంబంధించిన రోబోటిక్ ఎలక్ట్రిక్ కారును చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్లో తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చూడ్డానికే చాలా చిత్రంగా అనిపించిన ఈ కారుకు సంబంధించిన ప్రత్యేకతలు కూడా అంతే ఆకట్టుకునేలా ఉన్నాయి. అవేంటో చదివేద్దామా మరి?
ఈ బుజ్జి కారును(BUJJI CAR)జాయెమ్ ఆటోమోటివ్, మహీంద్రా కంపెనీలు కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. దీని కోసం దాదాపుగా రూ.7కోట్లు ఖర్చయ్యింది. ఈ కారులో చాలా యునీక్‌గా కనిపిస్తున్నవి దాని స్ట్రక్చర్ ఇంకా టైర్లు. ఏకంగా మనిషిని మించిపోయిన సైజులో వాటిని డిజైన్ చేశారు. ఈ టైర్ల ఎత్తు 2186 మిల్లీమీటర్లు, లెంగ్త్ వచ్చేసి 6075 ఎంఎం. విడ్త్ వచ్చేసి 3380 ఎంఎం. ఇక దీని రిమ్ సైజు విషయానికి వస్తే 34.5 ఇంచులు. ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ సియెట్(CEAT) ప్రత్యేకంగా వీటిని తయారు చేసి ఇచ్చిందట.
అంత పెద్ద పెద్ద టైర్లతో ఉన్న ఈ కారు బరువు ఆరు టన్నులు. పవర్ 94కేవీ, బ్యాటరీ 47 KWH, టార్క్ 9800NMగా ఉన్నాయి. ఈ కారును తయారు చేయడానికి ఇంజనీర్లంతో ఎంతో శ్రమించారట. ఇక అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా జైన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్‌తో భైరవ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కూడా నటిస్తున్నారు.