కృష్ణా: వంగవీటి మోహన్ రంగ కుమార్తె, వంగవీటి ఆశా కిరణ్ నేడు మచిలీపట్నం రానున్నారు. వలందపాలెంలో పునః ప్రతిష్టించిన రంగ విగ్రహాని ఆమె ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు మచిలీపట్నం అంబేద్కర్ సర్కిల్ చేరుకుని అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వలందపాలెం చేరుకుని రంగ విగ్రహం ఆవిష్కరణ చేస్తారు అని రంగ విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు.