VZM: గంట్యాడ మండల కార్యాలయాల సముదాయంలో ఈనెల 15న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆద్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ మేరకు ఉదయం 10.30కి ప్రారంభమయ్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ పిర్యాదులను మంత్రికి స్వయంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.