BPT: జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. ఈ అదాలత్లో 5 బెంచీలను ఏర్పాటు చేసి, మొత్తం 1272 కేసులను పరిష్కరించారు. వీటిలో 70 సివిల్ కేసులు, 1193 క్రిమినల్ కేసులు, 9 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో లావాదేవీలు కూడా జరిగాయని 6వ అదనపు జిల్లా జడ్జి శ్యాంబాబు తెలిపారు.