GNTR: మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్లో ఈ నెల 16న నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీతో కలసి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేదిక నిర్మాణం, అభ్యర్థుల రాకపోకలపై వారు అధికారులకు దిశానిర్దేశం చేశారు.