ATP: ఉరవకొండ పట్టణంలో నేడు సీఎస్ఐ చర్చి బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. చర్చి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.