KRNL: దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో జనసేన ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జి తెర్నేకల్ వెంకప్ప శనివారం పర్యటించారు. ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. బీసీ కాలనీలో రోడ్డు లేదని మహిళలు తెలపగా, త్వరలో నిర్మాణం చేపడతామని వెంకప్ప హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.