KDP: ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు కర్నూలులోనే నిర్మల నగరుకు చెందిన శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.