కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించి ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఆకుల రవితేజ, ఆర్గనైజ ర్లు రామారావు, మహేంద్ర అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని తెలిపారు.