ELR: వేలేరుపాడు మండలం రుద్రంకోటలో ఎస్సై నవీన్ కుమార్ తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థుల వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, పేకాట, కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామస్థులు మత్తు పదార్థాలను సేవించవద్దని ఎస్సై సూచించారు.