MNCL: 2వ సాధారణ పంచాయతీ పోలింగ్లో భాగంగా తాండూర్ మండలం అన్ని గ్రామపంచాయతిలలో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, చలి తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ క్యూ లైన్లలో నిలబడి ఓటు వేశారు.