HYD: GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.