KMM: నేలకొండపల్లి మండలం తిరుమలపురం పోలింగ్ కేంద్రం వద్ద నేడు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బూత్ ఏజెంట్లు లోపల ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు.