ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు. మొత్తం 1,788 మంది ఓటర్లకు గాను 1,629 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా గ్రామంలో రికార్డు స్థాయిలో 91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల రద్దీ కనిపించింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు.