BDK: మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా “గుమ్మడి నరసయ్య” సినిమా దర్శకులు నల్ల సురేష్ కుమార్ రెడ్డి ఇవాళ విచ్చేశారు. సమితి సింగారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, దాచేపల్లి శ్రీనివాస్, సందుపట్ల ఇంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.