VSP: రేపు జీవీఎంసీలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.