PDPL:రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మానాలి ఠాకూర్ ఆదివారం పాలకుర్తి మండలంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.