VZM: విశాఖ సిటీ చినముషిడివాడ మెయిన్ డోర్ వద్ద ఉన్న ఎం.ఆర్.ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన భవాని జ్యుయలరీ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మొదటి కొనుగోళ్లను ఎమ్మెల్యే చేశారు. వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.