SKLM: పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి లేబర్ కాలనీలో మురుగు కాలువలు నిండి రోడ్లపై మురుగునీరు పారుతుంది. ఈ రోడ్డు దాటాలంటే సాహసమే చేయాలని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల పదోన్నతపై మున్సిపల్ కమిషనర్గా విధుల్లో చేరిన శ్రీనివాసులు స్పందించి లేబర్ కాలనీలో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.