JN: ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను ఏమీ అనలేదని, ఇక అభివృద్ధి చేయకుంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తమ సర్పంచులను గెలిపిస్తే స్పెషల్ ఫండ్స్ తీసుకుచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తమదని నాయకులతో కలిసి భరోసా కల్పించారు.