నిత్యం అదానీని తిట్టే రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన స్పాన్సర్ చేసిన ఈవెంట్కు వెళ్లడం రచ్చ రేపుతోంది. మెస్సీ ఇండియా టూర్కు అదానీనే స్పాన్సర్. అలాంటిది HYDలో మెస్సీని రాహుల్ కలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్లో అదానీని అరెస్ట్ చేయాలనే రాహుల్.. ఆయన ఈవెంట్కు ఎలా వెళ్తారని, ఇది అదానీ బిజినెస్ ప్రమోషన్ కోసమేనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.