NDL: కొలిమిగుండ్ల మండలం కోరుమానపల్లె గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయ స్వామి ఆలయానికి నూతనంగా ఉత్సవమూర్తుల విగ్రహాలను దాతలు అందజేశారు. నూతనంగా నిర్మించిన పట్టాభిరామ ఆలయానికి తాడిపత్రి పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే దాత విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులకు ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దాతలను ఘనంగా సన్మానించారు.