అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బ్రౌన్ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్‌లోని క్యాంపస్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో ఫోన్లను సైలంట్‌గా ఉంచుకోవాలని, డోర్లను లాక్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.