HYD: 38వ హైదరాబాద్ బుక్ఫెయిర్ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లు నిర్ణయించారు.