VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ సరుకు రవాణాలో కొత్త మైలురాయిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 256 రోజుల్లోనే 100.38 మిలియన్ టన్నుల సరుకు రవాణా పూర్తి చేసి గత రికార్డును అధిగమించింది. ఇందులో 56.60 మిలియన్ టన్నుల లోడింగ్, 43.78 మిలియన్ టన్నుల అన్లోడింగ్ జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ ఎం లలిత్ బోహ్రా అధికారులు, సిబ్బందిని అభినందించారు.