కడప పట్టణంలో మాజీ మంత్రి తనయుడు పసుపులేటి పవన్ కుమార్ 40వ జన్మదిన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. శ్రీ విజయ సేవ సమితి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు కేక్, పండ్లు పంచిపెట్టారు. డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, పవన్ కుమార్ గత 45 ఏళ్లుగా పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు.