»Khan Patel Propel Us To Historic T20 Series Victory Over Bangladesh
USA vs Ban : అమెరికా చారిత్రాత్మక విజయం.. బంగ్లాకు షాకిచ్చి టీ20 సిరీస్ వశం!
అంతర్జాతీయ క్రికెట్లో పసికూనగా ఉన్న యూఎస్ఏ జట్టు బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
USA vs Ban : మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో బంగ్లాదేశ్(Bangladesh)… పసికూన అమెరికా చేతిలో వరుసగా రెండో సారి పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అమెరికా క్రికెట్ జట్టు(Cricket Team) టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై యూఎస్ఏ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ ఈ ఛేదనలో చతికిలబడింది. 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి అమెరికా(USA) సిరీస్‌ని కైవశం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇలా విజయాన్ని సాధించడంతో ఇప్పుడు అందరి చూపూ అమెరికా వైపు పడింది. టెస్టు మ్యాచ్‌లు ఆడే బంగ్లాదేశ్ లాంటి జట్టుపై బరిలో దిగి పసికూన జట్టు గెలవడం అంటే ఆషామాషీ విషయం కాదు. మరో పది రోజుల్లో వరల్డ్ కప్ ఉందనగా అమెరికా ఇలాంటి విజయం సాధించడం ఆ దేశానికి ఎంతో ప్రోత్సాహకర విషయమే. ఈ టీ 20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లో అమెరికా కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.
అమెరికా జట్టు ఇంతకు ముందు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్లలో కేవలం ఐర్లాండ్‌పై మాత్రమే విజయం సాధించింది. తప్ప మరే ఇతర దేశపు జట్టుతోనే గెలవలేదు. తాజాగా బంగ్లాపై విజయం సాధించడం ఆ జట్టు బలపడుతోందనడానికి నిదర్శనం అని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.