»Did Shami Commit Suicide What Happened That Night
Shami: షమీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడా? ఆ రాత్రి ఏం జరిగిందంటే?
భారత పేస్ దిగ్గజం మహ్మద్ షమీ తన కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు.
Did Shami commit suicide? What happened that night?
Shami: భారత పేస్ దిగ్గజం మహ్మద్ షమీ తన కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. 19వ అంతస్తుపై నుంచి కిందకు దూకి చనిపోవాలని అనుకున్నాడు. చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకుందామని షమీ ఎందుకు అనుకున్నాడు? ఎందుకు ఆ ఆలోచనను విరమించుకున్నాడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన మహ్మద్ షమీ… కొన్నేళ్ల క్రితం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. 2018వ సంవత్సరం షమీ జీవితంలో మరపురాని సంవత్సరం. ఆ ఏడాది షమీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న షమీ భార్య హసీ జహాన్…ఒక్కసారిగా విరుచుపడింది. షమీపై ఆరోపణలు గుప్పిస్తూ విడాకుల నోటీసు పంపింది. షమీకి చాలా మంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయని హసీ జహాన్ ఆరోపించింది. అదే విధంగా తనని హింసించేవాడని షమీపై గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టింది. భార్య చేసిన ఆరోపణల కారణంగా .. ఒక్కసారిగా షమీ జీవితం తలకిందులుగా మారిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమని షమీ పదే పదే చెప్పుకోవలసి వచ్చింది.
2021 టీ 20 వరల్డ్ కప్ సమయంలోనూ షమీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షమీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రికెట్ వీరాభిమానులు కొందరు సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా షమీని టార్గెట్ చేశారు. ఆ సమయంలో షమీ స్నేహితుడైన ఉమేష్ కుమార్… షమీకి అండగా నిలిచాడు. ఆ నాటి సంఘటనలను తాజాగా గుర్తుచేసుకున్నాడు. హిందీలో ప్రఖ్యాత యూ ట్యూబర్ శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీతో పాటు షమీ స్నేహితుడు ఉమేష్ కుమార్ కూడా పాల్గొన్నాడు. వీరిద్దరూ తమ జీవితంలో అనేక మరపురాని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తనపై వచ్చిఏ అనేక ఆరోపణలను సహించిన షమీ… తనను దేశ ద్రోహిగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణలను తట్టుకోలేకపోయాడని ఉమేష్ కుమార్ గుర్తు చేసుకున్నాడు.
ఒక రోజు తెల్లవారుజామున 4 గంటలకు తాను నీళ్లు తాగడానికి నిద్ర లేచానని… నీళ్లు తాగి తిరిగి బెడ్రూమ్లోకి వెళ్లే క్రమంలో బాల్కనీలోకి చూశానని… ఆ సమయంలో షమీ అక్కడ నిలబడి ఉన్నాడని ఉమేష్ కుమార్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో వెంటనే తాను అక్కడి వెళ్లకపోతే పరిస్థితి మరోలా ఉండేదని ఉమేశ్ తెలిపాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత షమీ నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని… మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని షమీ చెప్పి ఎంతగానో సంతోషించాడని ఉమేశ్ గుర్తుచేసుకున్నాడు. వరల్డ్ కప్ గెలవడం వల్లే వచ్చే ఆనందం కన్నా… ఆ రోజు క్లీన్ చిట్ లభించిన రోజు షమీ ఎక్కువ ఆనందపడ్డాడని ఉమేశ్ తెలిపాడు.
మహ్మద్ షమీ … అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ … షమీకి అండగా నిలిచాడు. ట్రోలర్లపై కోహ్లీ మండిపడ్డాడు. క్రమ క్రమంగా షమీ కోలుకున్నాడు. ఆటపై పూర్తిగా ఫోకస్ చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో వీరవిహారం చేశాడు. ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు. పునర్ వైభవం సంపాదించాడు. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొన్ని వారాలకు షమీకి గాయమైంది. గాయం నుంచి త్వరగా కోలుకోలేకపోయాడు. దీంతో టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గోలేకపోయాడు. ప్రస్తుతం బెంగళూర్‌లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తిరిగి ఫిట్నెస్ సాధించి భారత జట్టులోకి ప్రవేశించనున్నాడు. ఈ ఏడాది జరగనున్న అనేక మ్యాచుల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నాడు.