»Mohammed Shami Coming To The Team Fierce Practice Video Viral
Mohammed Shami: జట్టులోకి రానున్న మహమ్మద్ షమీ.. భీకర ప్రాక్టీస్.. వీడియో వైరల్
గాయం నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్‌నెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమీ.. గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.
Mohammed Shami coming to the team.. Fierce practice.. Video viral
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత భారత జట్టులో చేరనున్నాడు. గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ.. తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన షమీ.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కుడికాలి మడతకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. కొంత కాలం పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. తాను బౌలింగ్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా షమీ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వీడియోను షేర్ చేశాడు.
గాయం కారణంగా షమీ.. కీలక టోర్నమెంట్లను మిస్ అయ్యాడు. ఆసీస్ జట్టుతో జరిగిన హోం సిరీస్ తో పాటు ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ మిస్ అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్‌నెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమీ.. గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. నెమ్మది నెమ్మదిగా తన మునుపటి రిథమ్ అందుకోడానికి కొంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. ఫిట్నెస్ సాధించిన అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవలసి ఉంటుంది.
గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అదరహో అనిపించాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో మొత్తం 24 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్‌లో కూడా కాస్త ఇబ్బంది పడిన షమీ.. ఆ నొప్పిని తట్టుకుంటూ జట్టు కోసం ఆడాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ సిరీస్ ముందు గాయం తీవ్రరూపం దాల్చడంతో జట్టుకు దూరమయ్యాడు. టెస్టు మ్యాచుల్లో షమీ లేని లోటును ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్‌లు తీర్చారు. వారిద్దరూ భారత టెస్టుకు అండగా నిలిచారు. అదే విధంగా ఇటీవలే ముగిసిన టీ 20 వరల్డ్ కప్‌లో బుమ్రా, అర్షదీప్ సింగ్‌లు షమీ లేని లోటును తీర్చారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 32 వికెట్లు తీసి తమ సత్తా చాటుకున్నారు. వీరిద్దరికీ తోడుగా హార్ధిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేసి మెరుపులు మెరిపించాడు.