Before the eyes of the family.. Former Sri Lankan cricketer brutally murdered
Dhammika Niroshana: మాజీ క్రికెటర్ దారుణ హత్యకు గురయిన విషయం ప్రపంచవ్యాప్తంగా సంచనలంగా మారింది. ధామిక నిరోషన (Former Cricketer Dhammika Niroshana) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ ఆయన. కుటుంబం చూస్తుండగానే దారుణ హత్యకు గురయ్యాడు. భార్య బిడ్డల కళ్ల ఎదుటే దుండగులు ధామిక నిరోషనను కాల్చి చంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీలంకలోని గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధామిక (Dhammika Niroshana) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు.
అతన్ని నిరోధించే క్రమంలో దుండగుడు మాజీ క్రికెటర్‌పై దాడి చేశాడు. తరువాత అతడి కుటుంబాన్ని నిర్భందించాడు. తరువాత కుటుంబం కళ్ల ముందే తుపాకీతో ధామిక నిరోషను కాల్చి చంపాడు. తరువాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటిని అంతా పరీక్షించి కేసులను దర్యాప్తు చేపట్టారు. తరువాత నిరోషనను పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక దుండగుడికోసం గాలింపులు చేపట్టారు. కాల్పులకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ధామిక నిరోషిన శ్రీలంకకు చెందిన కుడి చేతివాటం కలిగిన ఫాస్ట్ బౌలర్. 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తరువాత రెండెళ్ల పాటు వన్డేలు, టెస్టులు ఆడాడు. ఆ తరువాత పస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన ధామిక కొన్ని వ్యక్తిగత కారణాల వలన 20 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేశాడు. ఇక అతడి మృతి పట్ల శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.