»World Cup 2023 What Is New Zealands Target In The Game Against Sri Lanka
NZvSL: న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
బెంగళూరు వేదికగా శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ ఆట ప్రారంభం నుంచి శ్రీలంకను కట్టడి చేసింది. ఫలితంగా శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులు చేసి అలౌట్ అయింది.
World Cup 2023 What is New Zealand's target in the game against Sri Lanka?
NZvSL: ఐసీసీ వన్డే ప్రపంచకప్2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు అన్ని జట్లు 8 ఆటలు ఆడేశాయి. ఇక ఈ టోర్నీలో 41వ మ్యాచ్‌గా ఈ రోజు బెంగళూరు వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ముందు నుంచి కివీస్ బౌలర్లు దూకుడుగా ప్రదర్శన కొనసాగించారు. ఫలితంగా శ్రీలంక భారీగా వికెట్లును సమర్పించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా 46.4 ఓవర్లలోనే 171 పరుగులు చేసి అందరు పెవిలియన్‌కు చేేరుకున్నారు. ఇక న్యూజిల్యాండ్ టార్గెట్ 172గా ఫిక్సైంది.
లీగ్ దశలో రెండు జట్లకూ ఇదే చివరి మ్యాచ్. కివీస్ గెలిస్తే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒక వేళ ఓడితే పాక్, అఫ్గాన్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంకకూ కూడా ఇది కీలక మ్యాచ్. వరల్డ్ కప్‌లో సెమీస్ అవకాశాలు లేనప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్‌లో తలపడాలంటే పాయింట్ల పట్టికలో టాప్ -8లో నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉంది.
కివీస్ బౌలర్ల ధాటికి పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) వరుసగా ఔటయ్యారు. ఓపెనర్ కుశాల్ పెరీరా 28 బంతుల్లో 51తో అర్థ శతకం బాదాడు. ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19) పరుగులు చేశారు. మహేశ్ తీక్షణ(39), దిల్షాన్ మధుశంక(19) పరుగులు చేశారు. ఇక కివీస్ బౌలర్ల విషయానికి వస్తే.. ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీసుకున్నాడు. లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్రలు రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. టిమ్ సౌతీ ఒక వికెట్ తీశాడు.