MBNR: జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. సీఎం సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వాహనాల్లో సభ వైపు కదలివెళ్లారు. ఈ సభ పాలమూరు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.