»Anchor Suma Is The Grandfather Of The Guinness Book Of Records
Anchor Suma: గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన యాంకర్ సుమ తాతయ్య
యాంకర్ సుమ తాతాయ్య గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన వయస్సు 98 ఏళ్లు..ఈ ఏజీలో ఏం రికార్డు సాధించాడని అనుకుంటున్నారా.. తాజాగా సుమ తన తాతా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Anchor Suma is the grandfather of the Guinness Book of Records
Anchor Suma: బుల్లితెర ద్వారా టాప్ యాంకర్ గా గుర్తుంపు తెచ్చుకున్న సుమ(Suma Kanakala), చేతినిండ సినిమా ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పంచుకోదు. తాజాగా సుమ తాతాయ్య గురించి ఒక పోస్ట్ పెట్టింది. తానకు ఎంతో ఆనందంగా ఉందని దానికి కారణం వాళ్ల అమ్మమ్మ తమ్ముడు పీబీ మీనన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో(Guinness Book of Records)కి ఎక్కడమే అని రాసుకొచ్చింది. పీబీ మీనన్ ప్రస్తుత వయసు 98 ఏళ్లు. గత 73 ఏళ్లుగా ఆయన న్యాయవాది వృత్తిలో సేవలందిస్తున్నారు.
ఎక్కువ కాలంపాటు న్యాయవాదిగా పనిచేసినందుకు ఆయన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా సుమ స్పందించారు. తాతయ్యే తన సూపర్ హీరో అని పేర్కొంటు..తనతో పాటు ఆయన ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. పీబీ మీనన్ గిన్నిస్ రికార్డును అందుకున్న ఫొటోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుమ తాతయ్య 73 ఏళ్ల 60 రోజులుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతుండగా..ఇంకొంత మంది సుమ కూడా బెస్ట్ యాంకర్‌గా గిన్నిస్ రికార్డులో ఎక్కుతుందని ప్రశంసిస్తున్నారు.