»Mohammed Shami Jealousy Will Never Achieve Good Results
Mohammed Shami: అసూయ ఉంటే ఎప్పటికీ మంచి ఫలితాలు సాధించలేరు
వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్‌లో జరిగింది. ఈ సందర్భంగా భారత్ బౌలర్లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మహమ్మద్ షమీ మరోసారి స్పందించాడు.
Mohammed Shami: వన్డే వరల్డ్‌కప్ 2023 భారత్‌లో జరిగింది. ఈ సందర్భంగా భారత్ బౌలర్లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టోర్నీ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐ భారత బౌలర్లకు మాత్రమే ప్రత్యేక బంతులు ఇస్తోందని.. దానివల్లే బ్యాటింగ్ పిచ్‌లపై మహమ్మద్ సిరాజ్, షమీ వేసిన బంతులు ఎక్కువగా స్వింగ్ అవుతున్నాయని రజా ఆరోపించాడు. దీనిని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా, పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్‌లు కూడా వ్యతిరేకించారు.
దీనిపై తాజాగా మహమ్మద్ షమీ మరోసారి స్పందించాడు. క్రికెట్‌ను హస్యాస్పదంగా మార్చారు. వేరేవాళ్ల విజయాన్ని వాళ్లు ఆనందించలేరు. మిమ్మల్ని ప్రశంసిస్తే సంతోషిస్తారు. కానీ ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులు మోసం చేశారని ఆరోపిస్తారు. జట్టుగా మేం సాధించిన విజయాలు, రికార్డులను చూడండి. ఇలాంటి అసూయతో ఉంటే ఎప్పటికీ మీరు మెరుగైన ఫలితాలు సాధించలేరని షమీ అన్నాడు.