»Mohammed Shami Undergoes Successful Heel Surgery To Repair Achilles Tendon Posts Pic From Hospital
Mohammed Shami : హాస్పిటల్ బెడ్‌పై మహ్మద్ షమీ ఫోటోలు వైరల్
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆయన హాస్పిటల్లో ఎందుకు చేరాల్సి వచ్చిందంటే...
Mohammed Shami Surgery: గత కొద్ది కాలంగా టీం ఇండియాలో మహ్మద్ షమి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రి బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోలు నెట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన అసలు ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆరా తీస్తే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.
మహ్మద్ షమీ (Mohammed Shami) సోమవారం తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో 2024 ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యారు. ఈ సర్జరీ సమయంలో ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. అవి ప్రస్తుతం నెట్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది జరిగిన వరల్డ్ కప్‌లో షమి 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన తర్వాత ఆయన మళ్లీ ఫీల్డ్‌లో కనిపించలేదు.
ఆ వరల్డ్ కప్ టోర్నీలోనే షమి(Shami) మడమ గాయానికి గురయ్యారు. దీంతో టీం ఇండియాకు దూరం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యారు. గాయం ఎంతకీ మనకపోవడంతో సర్జరీ తప్పదని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిజియోలు సూచించారు. దీంతో తాజాగా మడమకు సర్జరీ(Surgery) చేయించుకుని ఐపీఎల్ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. ఇది గుజరాత్ టైటాన్స్‌కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.